ఎన్నికల కోసమే మద్దతు ధర: కోదండరెడ్డి 

6 Jul, 2018 03:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు పెంచిందని టీపీసీసీ కిసాన్‌సెల్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన...ఎన్నికల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమను చూపిస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టానికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని, రూ.7,400 కోట్లకు సంబంధించిన పరిహారం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కేంద్రానికి పంపలేదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ...టీఆర్‌ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
 

మరిన్ని వార్తలు