‘గతంలో అనుమతులిచ్చాం.. ఇప్పుడు వద్దంటున్నాం’

20 Sep, 2019 14:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నల్లమలలో యురేనియం అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందన్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర జంతు పరిరక్షణ బోర్డుతో సమావేశం ఏర్పాటు చేసి అనుమతులు వెనక్కు తీసుకోవాలని కోరారు. లేకపోతే అచ్చంపేట నుంచి ‘ఛలో ప్రగతి భవన్‌’ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధుల సమావేశం గాంధీభవన్‌లో జరిగింది.

ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. యురేనియం కంటే బొగ్గు గనుల వల్ల ఎక్కువ నష్టం ఉంటుందని  కిషన్‌రెడ్డి అనడం ఆయన అవగాహనారాహిత్యమన్నారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలను పిలుచుకొని తెలుసుకోవాలని కేంద్రమంత్రికి సలహా ఇచ్చారు. యురేనియం ద్వారా గాలి, నీరు కాలుష్యమవుతాయని.. అడవి, చెంచులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చామని ఒప్పుకున్న మల్లురవి, కడపలో జరుగుతున్న నష్టం చూశాక వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. యురేనియం పేరుతో తెలంగాణ ప్రజల మీద దాడి చేసినట్టవుతుందనీ, రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి మైనింగ్‌ను రద్దు చేయించాలని సూచించారు.

మరోవైపు నేటి నుంచి కాంగ్రెస్‌ నేతలు టీవీ చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు మల్లు రవి వెల్లడించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలు టీవీ చర్చలకు దూరంగా ఉంటుండగా కాంగ్రెస్‌ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

వేములవాడలో కుప్పకూలిన బ్రిడ్జి

వెయ్యి క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌!

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రాజన్న విగ్రహాన్నే తొలగిస్తారు

నేటి నుంచి 'తెలంగాణ వైభవం'

ప్రతి పంచాయతీకీ నెలకు రూ.2లక్షలు

సీఎం కేసీఆర్‌ అంతు చూస్తాం..

ఆధార్‌ కార్డ తీసుకురమ్మని పంపితే పెళ్లి చేసుకొచ్చాడు

మావోయిస్టు పార్టీకి 15 ఏళ్లు

సాగునీటి సమస్యపై జిల్లా నేతలతో చర్చించిన సీఎం

మంకీ గార్డులుగా మారిన ట్రీ గార్డులు!

ఎన్నికల్లో ఓడించాడని టీఆర్‌ఎస్‌ నేత హత్య

అంతా కల్తీ

గుట్టల వరదతో ‘నీలగిరి’కి ముప్పు!

రేవంత్‌ వ్యాఖ్యలపై దుమారం

డెంగీ.. స్వైన్‌ఫ్లూ.. నగరంపై ముప్పేట దాడి

అడ్డొస్తాడని అంతమొందించారు

విద్యార్థీ.. నీకు బస్సేదీ?

ఎక్కడికి పోతావు చిన్నవాడా!

మూఢనమ్మకం మసి చేసింది

మహమ్మారిలా  డెంగీ..

మొసళ్లనూ తరలిస్తున్నారు!

అక్టోబర్‌ మొదటి వారంలో బోనస్‌

23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

యోగాకు ‘సై’ అనండి!

పద్నాలుగేళ్ల తర్వాత పలకరింపు!

జలాశయాలన్నీ నిండాయి : కేసీఆర్‌

కోడెల మృతికి  బాబే కారణం: తలసాని

భవిష్యత్తులో ఉచితంగా అవయవ మార్పిడి

కుమారుడిని లండన్‌ పంపించి వస్తూ... 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..