‘ట్రాక్‌’తో సాగు అనుసంధానం!  

25 May, 2020 04:08 IST|Sakshi

మంత్రి నిరంజన్‌రెడ్డితో ట్రాక్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: పంటల వివరాల నమోదు ప్రక్రియను ‘ట్రాక్‌’పైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. నియంత్రిత సాగు విధానంలో భాగంగా పంటల వివరాల నమోదు కీలకం కానుండటంతో ఆ బాధ్యతలను తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ట్రాక్‌)కు అనుసంధానం చేయాలని ప్రభుత్వంభావిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో ట్రాక్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. వానాకాలం నుంచి పంటల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. క్రాప్‌ కటింగ్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ డేటాను రిమోట్‌ సెన్సింగ్‌తో అనుసంధానం చేస్తే పంట ఉత్పత్తిని అంచనా వేసి 95% కచ్చితమైన సమాచారం వస్తుందన్నారు.

మరిన్ని వార్తలు