కరీంనగర్ లో ట్రేడ్ యూనియన్ ధర్నా

10 Mar, 2016 12:54 IST|Sakshi
కరీంనగర్: ఎన్‌డీఏ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ట్రేడ్ యూనియన్‌ నాయకులు ధర్నాకు దిగారు. కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వరంగ సంస్థ వాటాల అమ్మకం, విద్యుత్ చట్ట సవరణ బిల్లు, రక్షణ, రైల్వే రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆపాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు, స్కిమ్ వర్కర్స్‌కి కనీస వేతనం రూ.15 వేలు ఇచ్చి, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, ఐఎఫ్‌టీయూకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు