కేసీఆర్ కాన్వాయ్‌‌ వాహనానికి ట్రాఫిక్‌ చలానా!

3 Jun, 2020 17:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాన్వాయ్‌లోని వాహనానికి ట్రాఫిక్ చలానా పడింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఫైన్‌ తప్పలేదు. అతివేగంగా నాలుగుసార్లు వెళ్లడంతో చలానా విధించినట్టు ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. దీంతో చలానా మొత్తం రూ.4,140 ను సీఎంవో అధికారులు బుధవారం చెల్లించారు.
(చదవండి: హైదరాబాద్‌: సిటీ బస్సులకూ ఇక రైట్‌ రైట్‌!)

మరిన్ని వార్తలు