రేపటి నుంచి నుంచి తార్నాకలో ట్రాఫిక్ డైవర్షన్

3 Jul, 2015 22:14 IST|Sakshi

నల్లకుంట (హైదరాబాద్): తార్నాక సిగ్సల్స్ వద్ద (ఫ్లై ఓవర్) శనివారం నుంచి ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నట్ల్లు సుల్తాన్ బజార్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ ప్రేమ్ కాజల్ చెప్పారు. తార్నాక చౌరస్తాలో సిగ్నల్స్ కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులుతలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే శనివారం నుంచి ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ డైవర్షన్‌కు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు వాహనదారులు సహకరించాలని కోరారు. శుక్రవారం హరిత హారంలో భాగంగా నల్లకుంట ట్రాఫిక్ పీఎస్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు వెల్లడించారు.

ఓయూ నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనాలు తార్నాక సిగ్నల్స్ వద్ద నుంచి లెఫ్ట్ తీసుకుని మెట్టుగూడ వైపు కొద్ది దూరం ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా లాలాపేట నుంచి ఓయూ వైపు వెళ్లే వాహనదారులు తార్నాక సిగ్నల్స్ నుంచి లెఫ్ట్ తీసుకుని హబ్సిగూడ రోడ్డులో ముందుకు వెళ్లి యూ టర్న్ తీసుకోవాలన్నారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనాలు నేరుగా ఫై ్లఓవర్ పైనుంచి వెళతాయని చెప్పారు. ఉప్పల్ నుంచి వచ్చే వాహదారులు ఎవరైనా ఓయూ వైపు, లేదా లాలాగూడ వైపు వెళ్లాలంటే ఫై ్ల ఓవర్ కింది నుంచి నేరుగా వెళ్లిపోవచ్చునని అన్నారు. ఈ మేరకు దారి మళ్లింపుతో వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు