పోటెత్తిన వాహనాలు

19 Jul, 2015 00:33 IST|Sakshi

♦ పదివేలకు పైగా తరలివచ్చిన వెహికిల్స్
♦ కరువైన పార్కింగ్ స్థలాలు
♦ ములుగు నుంచి బారులు
♦ ముల్లకట్ట వైపు దారి మళ్లింపు
♦  పోలీసులకు ముచ్చెమటలు
♦ మధ్యాహ్నం తర్వాత తగ్గిన ట్రాఫిక్ క్లియర్
 
 సాక్షి, హన్మకొండ/మంగపేట : జిల్లాలోని మంగపేట, ముల్లకట్ట, రామన్నగూడెం పుష్కరఘాట్లకు భక్తులతోపాటు వాహనాలు పోటెత్తారుు. రంజాన్ సందర్భంగా శనివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పలు వాహనాల ద్వారా గోదావరి తీరం చేరారు. ఉదయం 7గంటలకే మంగపేట పుష్కరఘాట్ పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోరుుంది. వాహనాల రాక మరింత పెరగడంతో ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలు చూపించలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. దీంతో గంపోనిగూడెం వద్దే వాహనాలు నిలిచిపోయూరుు. మంగపేట, కమలాపురం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర బారులు తీరారుు.

ఉదయం పదిగంటలకు ఏటూరునాగారం అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద నిమిషానికి కనీసం 25వాహనాల చొప్పున మధ్యాహ్నం వరకు సుమారు 7500వాహనాలు మంగపేట వైపువెళ్లారుు. అదే సమయానికి పుష్కరస్నానాలు ఆచరించిన మరికొందరు భక్తులు తిరుగు ప్రయాణం కావడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు కిక్కిరిశారుు. ముఖ్యంగా పస్రా, తాడ్వాయి నుంచి ఏటూరునాగారం వరకు సింగిల్‌రోడ్డు కావడంతో ఇబ్బందులు తలెత్తారుు.

 ఏటూరునాగరం వద్ద దారి మళ్లింపు
 అన్ని వాహనాలు కమలాపురం-మంగపేట వైపు వెళ్లకుండా కొన్నింటిని ఏటూరునాగాం మీదుగా రామన్నగూడెం, మంగపేట వైపు దారి మళ్లించారు. మంగపేట వైపు నుంచి వాహనాలు వెళ్లడంతో రామన్నగూడెం-ఏటూరునాగారం మధ్య ట్రాఫిక్ పెరిగింది. రామన్నగూడెం వచ్చిన వాహనాలు తిరుగుప్రయాణంలో పప్కాపూర్ మీదుగా మళ్లించినా.. వాహనాలు వేగంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ముల్లకట్ట వైపు వెళ్లేలా వాహనాలను దారి మళ్లించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.00 గంటల రద్దీ అధికం కావడంతో ఏటూరునాగరం క్యాంపు ఆఫీస్ సమీప పాఠశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈలోగా జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా మంగపేట చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పాల్గొన్నారు.

ఆ వెంటనే అదనపు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. మరికొందరు భక్తులు తామే వాహనాలను అడవులు, పొలాల్లో పార్కింగ్ చేసుకుని ఐదారు కిలోమీటర్లు కాలినడక ప్రయాణం చేసి పుష్కరఘాట్లకు చేరుకోవడం ప్రారంభించారు. ఫలితంగా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ట్రాఫిక్ పోలీసుల అదుపులోకి వచ్చింది. అరుుతే, ట్రాఫిక్ సమస్యతో ఆర్టీసీ బస్సులు సకాలంలో నడవలేదు. నిరీక్షించిన భక్తులు ఆందోళన చేపట్టారు. అధికారులు జోక్యంతో శాంతించారు. కాగా, ఒక్కరోజే సుమారు పదివేల వాహనాల్లో దాదాపు 2.50లక్షలమంది భక్తులు  పుష్కర స్నానాలు ఆచరించారని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని వార్తలు