బాతాఖానీ.. ఇదేం పని!

12 Mar, 2020 12:23 IST|Sakshi
రోడ్డు మధ్యలో లారీని ఆపి బాతఖానీ కొడుతూ..

కుత్బుల్లాపూర్‌: బహదూర్‌పల్లి ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ లారీని ఆపినా ఆగలేదంటూ నడి రోడ్డులో నిలిపివేసి తమాషా చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. ఒక వైపు ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడినప్పటికీ సదరు కానిస్టేబుళ్లు లారీని కదలనీయకుండా రోడ్డు మధ్యలో నిలిపి ట్రాఫిక్‌ను లారీ చుట్టూ తిప్పి పంపించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇలా పది నిముషాల పాటు హల్‌చల్‌ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు మీదనే బాతాఖానీ కొడుతూ లారీని మధ్యలో ఆపడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీని పక్కన ఆపి ఫైన్‌ వేయాల్సిందిపోయి ఇలా ఇతరులకు ఇబ్బంది కలిగించారని పలువురు వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద రోడ్డు మధ్యలో లారీ ఆపుతున్న ట్రాఫిక్‌  కానిస్టేబుల్‌.. సర్కిల్‌లో..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు