నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

10 Sep, 2019 11:05 IST|Sakshi

మెహర్రం ఊరేగింపు నేపథ్యంలో పాతబస్తీలోని అనేక చోట్ల విధింపు

మంగళవారం ఉదయం 11 నుంచి అమలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు గస్తీ, నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఓల్డ్‌సిటీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర కొత్వాల్‌ అంజనీ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని, వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. 

డబీర్‌పుర వైపు నుంచి ఆల్వా బీబీ వైపు వచ్చే వాహనాలను సునార్‌ గల్లీ ‘టి’ జంక్షన్‌ నుంచి మత్తాకీ ఖిడ్కీ వైపు మళ్లిస్తారు.
డబీర్‌పుర వైపు నుంచి వచ్చేవాహనాలను షేక్‌ ఫైజా కమాన్‌ వైపు అనుమతించకుండా జబ్బీర్‌ హోటల్‌ వైపు పంపిస్తారు.
యాకత్‌పుర రైల్వే స్టేషన్‌ నుంచి షేక్‌ ఫైజా కమాన్‌ వైపు వెళ్లే వాహనాలను బడా బజార్‌ ‘టి’ జంక్షన్‌ నుంచి చావ్నీ మీదుగా మీర్‌ జుల్మా తలాబ్‌కట్ట వైపు పంపిస్తారు.
పురానీ హవేలీ నుంచి ఏతిబజార్‌ చౌక్‌ వచ్చే వాహనాలను సెట్విన్‌ చౌరస్తా నుంచి డబీర్‌పుర వైపు మళ్లిస్తారు.
మిట్టీ కా షేర్‌ నుంచి ఏతిబజార్‌ వైపు వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌస్‌ నుంచి మదీనా చౌరస్తా వైపు పంపిస్తారు.
మొఘల్‌పుర నుంచి కోట్ల అలీజా వైపు వెళ్లే వాహనాలను బీబీ బజార్‌ చౌరస్తా నుంచి తలాబ్‌కట్ట వైపు మళ్లిస్తారు.
మొఘల్‌పుర వాటర్‌ ట్యాంక్‌ నుంచి చౌక్‌ మదీనా ఖాన్‌ వైపు వచ్చే వాహనాలను హఫీజ్‌ ధంకా మసీదు నుంచి శాలిబండ వైపు పంపిస్తారు.
శాలిబండ వైపు నుంచి చార్మినార్‌ వైపు వచ్చే వాహనాలను పార్శీ కేఫ్‌ నుంచి మొఘల్‌పుర వైపు పంపిస్తారు.
పురానాపూల్‌ నుంచి చార్మినార్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చౌక్‌ ముర్గాన్‌ నుంచి ఛేలాపురా, షాగుంజ్, ఖిల్వత్‌ వైపు పంపిస్తారు.
హిమ్మత్‌పురం నుంచి ఖిల్వత్, లాడ్‌ బజార్‌  వైపు వెళ్లే వాహనాలను  మోతీగల్లీ నుంచి మూసాబౌలి వైపు మళ్లిస్తారు.
షక్కీర్‌కోటి నుంచి వచ్చే వాహనాలను మిట్టీ కా షేర్‌ నుంచి ఘాన్సీబజార్, ఛేలాపుర వైపు పంపిస్తారు.
సిటీ కాలేజ్, ముస్లింజంగ్‌ బ్రిడ్జ్‌  వైపు నుంచి వచ్చే వాహనాలను న్యూ బ్రిడ్జ్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపు మళ్లిస్తారు.
నయాపూల్‌ నుంచి చార్మినార్‌ వైపు వచ్చే వాహనాలను మదీనా చౌరస్తా నుంచి సిటీ కాలేజ్‌ వైపు పంపిస్తారు.
చాదర్‌ఘాట్, సాలార్‌జంగ్‌ బ్రిడ్జి, నూర్‌ ఖాన్‌ బజార్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను దారుష్షిఫా చౌరస్తా నుంచి నయాపూల్‌ వైపు పంపిస్తారు.
చాదర్‌ఘాట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కాలీఖబర్‌ వైపు పంపించరు. వీటిని శాంతి లాడ్జ్‌ వద్ద నుంచి చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వైపు పంపిస్తారు. 

సికింద్రాబాద్‌ ప్రాంతంలో ఇలా
మొహర్రం ఊరేగింపు నేపథ్యంలోసికింద్రాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇవిమంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు  అమలులో ఉంటాయి.   
ట్యాంక్‌బండ్, కర్బాలా మైదాన్‌ వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్‌ పార్క్‌ నుంచి కవాడీగూడ, బైబిల్‌హౌస్, ఆర్పీ రోడ్‌ మీదుగా మళ్లిస్తారు.
కర్బాలా మైదాన్‌ మీదుగా ఆర్పీ రోడ్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను బేగంపేట్‌ పాత ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ రోడ్‌ మీదుగా పంపిస్తారు.  
ఎంజీ రోడ్, సెంట్రల్‌ టెలిగ్రాఫిక్‌ ఆఫీస్‌ ఐలాండ్, రాణిగంజ్‌ మధ్య వన్‌వే అమలులో ఉంటుంది. కేవలం రాణిగంజ్‌ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ట్రాఫిక్‌ను రాణిగంజ్‌ చౌరస్తా నుంచి మినిస్టర్స్‌ రోడ్‌ వైపు పంపిస్తారు. 

>
మరిన్ని వార్తలు