ట్యాంక్‌బండ్‌పై ‘మిలియన్‌ మార్చ్‌’ ట్రాఫిక్‌ ఆంక్షలు

10 Mar, 2018 07:19 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘మిలియన్‌ మార్చ్‌’ పిలుపు నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇవి అమలులో ఉంటాయని పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నిషేధించారు.  
సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మైదాన్‌ దాటి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్‌ క్లబ్‌–కవాడిగూడ–డీబీఆర్‌ మిల్స్‌–కట్టమైసమ్మ–అంబేడ్కర్‌ విగ్రహం–తెలుగుతల్లి–రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు.
నెక్లెస్‌ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా వచ్చే వాహనాలను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదికి అనుమతించరు. వీటిని గగన్‌మహల్‌–ఇందిరాపార్క్‌ మీదుగా పంపిస్తారు.
నిరంకారి, పాత సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్, ఇక్బాల్‌ మీనార్‌ మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను మింట్‌ కాంపౌండ్‌/సెక్రటేరియేట్‌–ఎన్టీఆర్‌ మార్గ్‌–నెక్లెస్‌ రోటరీ–సంజీవయ్య పార్క్‌–నల్లగుట్ట–సికింద్రాబాద్‌ మీదుగా మళ్లిస్తారు.  
లిబర్టీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీఆర్‌కే భవన్‌–తెలుగుతల్లి –నెక్లెస్‌ రోటరీ–వీవీ స్టాట్యూ లేదా నెక్లెస్‌ రోడ్‌–సంజీవయ్యపార్క్‌–సికింద్రాబాద్‌ మీదుగా పంపిస్తారు.
బషీర్‌బాగ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను మోర్‌ మెడికల్‌ హాల్‌–బాలాజీ గ్రాండ్‌ బజార్‌–క్రిస్టల్‌–తెలుగుతల్లి–ఇక్బాల్‌ మీనార్‌ మీదుగా పంపిస్తారు.  

నేడు పార్కులకు సెలవు
తార్నాక: మిలియన్‌ మార్చ్‌ను పురస్కరించుకుని హెచ్‌ఎండీఏ పరిధిలోని పార్కులకు శనివారం సెలువు ప్రకటించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఎన్‌టీఆర్, లుంబిని పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంటాయని ప్రజలు గమనించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు