మారనున్న రైళ్ల వేళలు!

3 Mar, 2015 21:15 IST|Sakshi

హైదరాబాద్: రామగుండం-పెద్దంపేట మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో మంగళవారం తెలిపారు. ఈనెల 4 నుంచి 6 వరకు ఈమేరకు మార్పులు అమలవుతాయని పేర్కొన్నారు.

 

ఈనెల 4న రద్దయిన రైలు: సిర్పూర్- కాజీపేట మధ్య నడిచే నంబర్ 57122 రామగిరి ప్యాసింజర్.
4న పాక్షికంగా రద్దయిన రైలు: భద్రాచలం- సిర్పూర్ మధ్య నంబర్ 57123 సింగరేణి ప్యాసింజర్ వరంగల్ వరకే నడుస్తుంది. హైదరాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ నంబర్ 17011 ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రామగుండం వరకే నడుపుతారు. అలాగే, నంబర్ 17012 రైలు ఉదయం 11.45 గంటలకు రామగుండం నుంచి సికింద్రాబాద్ వైపు బయలుదేరుతుంది. నంబర్ 17035 సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కాజీపేట్ వరకు నడుస్తుంది. నంబర్ 17036 రైలు కాజీపేట్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు సికింద్రాబాద్‌కు బయలుదేరుతుంది. కరీంనగర్-సిర్పూర్ ప్యాసింజర్ పెద్దపల్లి వరకే నడుస్తుంది. నంబర్ 77256 రైలు సాయంత్రం 1.40 గంటలకు పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు బయలుదేరుతుంది.
సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్తే 12791 నంబర్ రైలు ఉదయం 10 గంటలకు బదులు 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.
బల్లార్షా- భద్రాచలం రోడ్ సింగరేణి ఎక్స్‌ప్రెస్ కూడా 30 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది.
5వ తేదీన వేళలు మారిన రైళ్లు:
జమ్మూతావి-చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్, పాట్నా-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ- చెన్నై గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్ కొద్ది ఆలస్యంతో నడుస్తాయి.
6వ తేదీన రద్దయిన రైలు:
సిర్పూర్- కాజీపేట్ రామగిరి ప్యాసింజర్ రైలు
పాక్షికంగా రద్దయిన రైళ్లు:
భద్రాచలం- సిర్పూర్ టౌన్ సింగరేణి ఎక్స్‌ప్రెస్ వరంగల్ వరకే నడుస్తుంది.
సిర్పూర్-సికింద్రాబాద్ నంబర్ 17035 తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను రామగుండం వరకే నడుపుతారు. నంబర్ 17036 రామగుండం నుంచి 6వ తేదీ సాయంత్రం 3.40 గంటలకు సికింద్రాబాద్ బయలుదేరుతుంది. అలాగే, కరీంనగర్- సిర్పూర్ టౌన్ డెమూ పెద్దపల్లి వరకే నడుస్తుంది. నంబర్ 77256 రైలు పెద్దపల్లి నుంచి సాయంత్రం 1.40 గంటలకు కరీంనగర్‌కు బయలుదేరుతుంది. సిర్పూర్- సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11 గంటలకు బదులు 11.45 గంటలకు బయలుదేరుతుంది.

 

 

మరిన్ని వార్తలు