ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్‌పై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్‌ వేటు

14 Dec, 2019 17:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ శిక్షణ నుంచి సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా వివరాల్లోకి వెళితే...  కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వరరెడ్డి తనను మోసం చేశాడంటూ భావన బిరుదల గతంలో హోంశాఖతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో పోలీసులు మహేశ్వరరెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్‌తో భావనకు పరిచయం... ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. ఏడాదిన్నర క్రితం మహేశ్వరరెడ్డి, భావన కీసర రిజిస్ట్రర్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కొంతకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే మహేశ్వరరెడ్డి ఐపీఎస్‌గా ఎంపిక అయిన తర్వాత తనను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు, మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని..విడాకులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జవహర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు