నిరుద్యోగ యువతకు శుభవార్త

9 May, 2018 11:02 IST|Sakshi

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

18 వృత్తి నైపుణ్య కేంద్రాల ఏర్పాటు

రెండు నుంచి ఆరు నెలల కాలపరిమితి

శిక్షణ పొందినవారికి ప్లేస్‌మెంట్‌ గ్యారంటీ

సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్లేస్‌మెంట్‌ గ్యారంటీతో వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 18 వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 1,627 మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించించి. మొత్తం అభ్యర్థుల్లో 702 మంది మైనారిటీ, 625 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గురుకుల విధానంలో  రెండు నుంచి ఆరు నెలల  కాల పరిమితి శిక్షణ ఉచితంగా అందించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఆపైన చదివిన అభ్యర్థులు శిక్షణకు అర్హులు. ప్రస్తుతం 512 మంది ఆయా కేంద్రాల్లో  శిక్షణ పొందుతున్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ అందించేం దుకు ఈ సీఐఎల్‌ అలీఫ్, సెట్విన్, ఏస్, డైలాగ్‌ ఇన్‌డార్క్, క్యాబ్‌ ఫౌండేషన్, సీపెట్, డాన్‌వాస్కో టెక్నాలజీ,  టీఎస్‌ ఆర్టీసీ సంస్థలతో  అధికార యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రాంతాల వారీగా కోర్సులు ఇలా.. 
రియాసత్‌నగర్‌:  ట్యాలీ,జీఎస్టీ, డీటీపీ, డిజైనింగ్‌ కోర్సులు 
అమీర్‌పేట: డీటీపీ, నెట్‌వర్కింగ్, హార్డ్‌వేర్‌ 
మలక్‌పేట, అంబర్‌పేట, నషేమాన్‌నగర్, హేజ్‌ బాబానగర్‌: టైలరింగ్‌ కోర్సులు 
విద్యానగర్, మీరాలం ట్యాంక్, బహదుర్‌ పురా, జూపార్క్‌: ఏసీ రిపేరింగ్, మొబైల్‌ సర్వీసింగ్, బ్యూటిషియన్‌. 
పెద్ద అంబర్‌పేట: లైఫ్‌ స్కిల్స్‌ (అంధులకు మాత్రమే)  
కోటి, దూద్‌బౌలి, బండ్లగూడ, గాగిల్లాపురం, రామాంతపూర్‌: హాస్పిటాలిటీ, బెడ్‌సైడ్‌ నర్సింగ్, రిటైల్‌ మార్కెటింగ్, ఎలక్ట్రానిక్, వెల్డింగ్, ఏసీ సర్వీసింగ్‌ తదితర 70 రకాల ట్రేడ్స్‌.  
హకీంపేట: లైట్‌ మోటార్‌ వెహికిల్, హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ శిక్షణ సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు 

జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి:    86397 87489 
ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ:    94899 05999 
ఈసీఐఎల్‌ ప్రోగామింగ్‌ ఆఫీసర్‌:    99857 98828 
అలీప్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    98498 02970 
సెట్విన్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    98666 53908 
ఏసీఈ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    94408 04858 
పాలిటెక్నిక్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    99123 42001 
క్యాప్‌ ఫౌండేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    87989 69698 
సీఐసీఈటీ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    99593 33415 
డాన్‌బాస్కోటెక్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    99005 46572 
టీఎస్‌ఆర్టీసీ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    73828 10023 
టీఎస్‌ ఆర్టీసీ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌:    73828 00936  

మరిన్ని వార్తలు