గణపతి విగ్రహాల తయారీలో శిక్షణ

5 Jul, 2018 09:24 IST|Sakshi
 శిక్షణకు వచ్చిన వృత్తి కళాకారులతో కుమ్మరి సంఘం రాష్ట్ర కమిటీ  

ధారూరు : ఆధునిక యంత్రాలతో గణపతి విగ్రహాలను తయారు చేయడానికి రాష్ట్ర అత్యంత వెనుకబడిన అభివృద్ధి సంస్థ (ఎంబీసీ కార్పొరేషన్‌) కుమ్మరులకు శిక్షణ ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎంపిక చేసిన కుమ్మరులకు యాదాద్రి జిల్లాలోని బూదాన్‌ పోచంపల్లి మండలంలో ఉన్న జలాల్‌పూర్‌ స్వామి రామానందతీర్థ గ్రామీణ శిక్షణ సంస్థలో 5వ బ్యాచ్‌ కింద ఐదుగురు శిక్షణ కోసం వెళ్లారు.

ఈ సందర్భంగా కుమ్మరుల జర్నలిస్టు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కే.వెంకటయ్య మాట్లాడుతూ గుజరాత్‌లో ఆధునిక యంత్రాలతో కుమ్మరులు గణపతి విగ్రహాలు, ప్రమిదలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూడా కొంతమందికి శిక్షణ ఇవ్వడానికి ఎంబీసీ సంస్థ చైర్మన్‌ తాడూరీ శ్రీనివాస్‌ ప్రత్యేక చొరత తీసుకున్నారన్నారు. అక్కడ శిక్షణ పొందిన కుమ్మరులు జిల్లాలోని మండలానికి ఇద్దరు చొప్పున ఎంపిక చేసి మొత్తం 40 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రంలో కూడా ఆధునిక యంత్రాలతో మట్టి గణపతులు, ప్రమిదలను తయారు చేసి వినాయక చవితికి సిద్ధం చేయనున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర వాప్తంగా 5 నుంచి 7 లక్షల వరకు గణపతి విగ్రహాలను ఆధునిక యంత్రాల సహాయంతో తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వాటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్గిస్తుందన్నారు. ఆధునిక యంత్రాల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మట్టి వినాయకుల విగ్రహాలు, ప్రమిదలను తయారు చేసే వీలుంటుందన్నారు.

మరిన్ని వార్తలు