విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ

26 Apr, 2018 10:36 IST|Sakshi
సేంద్రియ పద్ధతులు వివరిస్తున్న విద్యార్థులు 

సమ్మర్‌ క్లాసులు బాగున్నాయి

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

సిద్దిపేటరూరల్‌ : విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సమ్మర్‌ క్లాసుల్లో భాగంగా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా బాగుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమీషన్‌ సభ్యులు అన్నారు. బుధవారం అర్బన్‌ మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామంలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటుగా కమీషన్‌ సభ్యులు సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నా ఆలోచన చాలా గొప్పదని, దీనిని విద్యార్థులు ఉత్సాహంతో నేర్చుకోవడం చాలా మంచి విషయం అన్నారు. అదే విధంగా పచ్చని పర్యావరణంలో పిల్లలకు అన్ని రకాల అవగాహన సదస్సులు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు.

సేంద్రియ వ్యవసాయం గురించి విద్యార్థులు చాలా బాగా వివరించారని వారిని అభినందించారు. విద్యార్థులకు డిజిటల్‌ క్లాస్‌రూంలు, మిర్రర్‌ ప్రాజెక్టులు నిర్వహించడం పై ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్, నాయకులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు