పారదర్శకమైన పాలనే ధ్యేయం

1 Nov, 2014 03:02 IST|Sakshi
పారదర్శకమైన పాలనే ధ్యేయం

 సూర్యాపేట : ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకుసాగుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక అధ్యక్షత జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో జరిగిన తప్పిదాల వలన ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేం దుకు కృషి చేస్తామన్నారు. పట్టణ పరిధిలోని చెరువులను అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు నీటి సమస్య రాకుండా కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలో ప్రధానమైన సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిని పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
 
 ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలో ఉన్న కంపచెట్ల తొల గింపు కార్యక్రమం వెంటనే చేపట్టాల న్నారు. అందుకు స్థలాల యజమానులకు కౌన్సిల్ నుంచి ముందస్తు సమాచారమందించాలన్నా రు. పారిశుద్ధ్య మెరుగుదల కోసం బయో మరుగుదొడ్ల నిర్మాణా నికి కసరత్తు జరుగుతుందని చెప్పారు. పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు సేకరించా లని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నివాస గృహాల మధ్యలో,  పైభాగంలో విద్యుత్ తీగలు ఉన్నట్టయితే సత్వరమే తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.నాగేశ్వర్, వైస్ చైర్మన్ నేరెళ్ల లక్ష్మి, తహసీల్దార్ వెంకటేశం, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి డీఎస్వీ శర్మ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు