రొమ్ము కేన్సర్‌ ఔషధ ధరలకు కళ్లెం

20 Dec, 2019 04:09 IST|Sakshi

65 శాతం ధరలు తగ్గుతాయన్న డబ్ల్యూహెచ్‌ఓ..

సాక్షి, హైదరాబాద్‌: రొమ్ము కేన్సర్‌ చికిత్స కు ఉపయోగించే ‘ట్రాస్టూజుమాబ్‌’ ఔషధ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఏకంగా 65 శాతం తగ్గుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం తెలిపింది. ప్రస్తుతం వీటి ధర ఒక కోర్సుకు రూ.14.20 లక్షలుగా ఉంది. ఇప్పుడు అనేక కంపెనీలకు దాన్ని తయారు చేసే అవకాశం కల్పించడంతో దాని ధర తగ్గనుంది. 65 శాతం ధర తగ్గితే ఆ ఔషధం రూ.4.97 లక్షలకే లభించే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, తెలంగాణలో కార్పొరేట్‌ ఆస్పత్రులే ఈ ఔషధాన్ని రోగులకు ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో, ఆరోగ్యశ్రీ రోగులకు ఈ ఔషధాన్ని వాడట్లేదు. ధర తగ్గడం వల్ల ఆరోగ్యశ్రీ రోగులకు కూడా దీన్ని ఇచ్చే అవకాశముందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు