ప్రారంభం కాని ‘ట్రామా’

9 Jul, 2014 03:07 IST|Sakshi

 కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్‌ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. 2013 డిసెంబర్ 15వ తేదీన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కేశవ్ దేశ్‌రాజ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వైవీ అనూరాధ, వైద్య ఆరోగ్యమిషన్ డెరైక్టర్లు డాక్టర్ బుద్ధ ప్రకాశ్, జ్యోతి కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, ట్రామాకేర్ సెంటర్ భవనాన్ని సందర్శించారు. నివేదికలు పూర్తిగా సిద్ధం చేసుకుని వెళ్ళారు. అయితే వారు సందర్శించి 6 నెలలకుపైగా గడిచినా ట్రామాకేర్ సెంటర్ ప్రారంభం విషయంలో ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు.

 రూ.4 కోట్లకు పైగా నిధులతో..
 రహదారులపై ప్రమాదాలకు గురయ్యేవారికి వైద్యం అందించడానికి రూ. 4 కోట్లకుపైగా నిధులతో ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికి ట్రామాకేర్ సెంటర్ భవన నిర్మాణానికి రూ. 67 లక్షలు ఖర్చు చేశారు. అలాగే మరో రూ. కోటితో ఆధునాతన అంబులెన్స్, ఎక్స్‌రే యంత్రం, ఈసీజీ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్‌లోని పరికరాలు కొన్నారు. అయితే అవన్నీ ఆయా గదుల్లో తుప్పు పడుతున్నాయి. ఆస్పత్రి ఆవరణలో ఆంబులెన్స్ ధ్వసం అయి ఉంది. ఇంకా రూ. కోటిన్నర విలువగల యంత్రాలు రావాల్సి ఉంది. అలాగే ఈ సెంటర్‌కు కావాల్సిన ఆర్థోపెటిక్ సర్జన్లు, మత్తు డాక్టర్లు, న్యూరాలజిస్టు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది తదితరులను నియమించాల్సి ఉంది.

 లక్షల రూపాయలు గుల్ల
 కామారెడ్డి జాతీయ రహదారితోపాటు ఆయా మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు మెరుగైన వైద్యం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ట్రామాకేర్ సెంటర్ ప్రారంభమైతే ఇక్కడే మెరుగైన వైద్యసేవలు అందేవి. సెంటర్ ప్రారంభం కాకపోవడంతో క్షతగాత్రులు ప్రైవేట్ ఆస్పత్రులు, హైదరాబాద్‌కు వెళ్లడంతో వేల రూపాయలు ఖర్చవుతున్నాయి.

 నెల రోజుల్లోనే 11 మంది మృతి
 కామారెడ్డి డివిజన్ పరిధిలో కేవలం జూన్ ఒక్క నెలల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతిచెందగా 20 మందికి తీవ్ర గాయాల య్యాయి. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యు వకులే మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. వీ రిలో తలకు గాయాలై చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కొందరు మృతిచెందా రు. వీరికి ట్రామాకేర్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందితే కొందరైన బతికుండేవా రు. మాచారెడ్డి, సదాశివనగర్, భిక్కనూరు, గాంధారి, దోమకొండ మండలాలతో పాటు డి చ్‌పల్లి నుంచి రామాయంపేట్ వరకు జాతీయరహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతూ చాలామంది మృత్యువాత పడుతున్నారు.

మరిన్ని వార్తలు