నకిలీ మందులతో వైద్యం 

7 Feb, 2018 18:04 IST|Sakshi

నిజాంసాగర్‌(జుక్కల్‌) : కంటి వైద్యుడిగా పరిచయమై నకిలీ మందులతో ఇస్తూ అమాయక ప్రజలను బురిడి కొట్టించిన దొంగ వైద్యుడిని గ్రామస్తులు నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ ప్రాంతానికి చెందిన హమీద్‌ కంటి వైద్యుడిగా చెలామణి అయ్యారు. మంగళవారం నిజాంసాగర్‌ మండలం గున్కుల్‌ గ్రామంలో వృద్ధులకు పరీక్షలు చేస్తూ, నాటు మందులు అందించారు. అంతేకాకుండా వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి ఒకే రకమైన నాటు మందులు ఇవ్వడంతో పాటు కంటి అద్దాల కోసం రూ.300 నుంచి రూ. 450 వరకు వసూల్‌ చేశాడు. వైద్య సేవలు, అతడి పనితీరుపై అనుమానం వచ్చిన స్తానికులు వైద్యుడిని నిలిదీశారు. తాను కామారెడ్డిలోని ఓ కంటి ఆస్పత్రి వైద్యుడి వద్ద పనిచేశానని సమాధానం చెప్పడంతో సదరు ఆస్పత్రికి ఫోన్‌చేయగా తమ వద్ద ఎవ్వరూ పనిచేయలేదని చెప్పారు. అనుమానం వచ్చిన స్తానికులు దొంగ వైద్యుడిగా గుర్తించి రోగులకు అందించిన నాటు మందులు, వారి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులను రికవరి చేసుకున్నారు. పొంతనలేని సమాధనాలు చెప్పడంతో స్తానికులు దొంగ వైద్యుడిని పోలీసులకు అప్పగించారు.   

మరిన్ని వార్తలు