మార్కెట్లోకి జీసీసీ ‘హనీ ట్విగ్స్‌’

31 Jan, 2020 05:32 IST|Sakshi

తేనె విక్రయాల్లో గిరిజన సహకార సంస్థ సరికొత్త ఆవిష్కరణ

చిన్న ప్యాకెట్ల ద్వారా ప్రతి ఇంటికీ చేరువయ్యే వ్యూహం

సాచెట్ల రూపంలో ఏటా 25 మెట్రిక్‌ టన్నుల తేనె విక్రయాలే లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: ‘గిరి’తేనెను ప్రతి ఇంటికీ చేర్చాలనే లక్ష్యంతో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది. టమోటా సాస్‌ సాకెట్ల తరహాలో తేనెను తక్కువధరకు లభ్యమయ్యేలా ‘హనీ ట్విగ్స్‌’రూపంలో మార్కెట్లోకి తెచ్చింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌  గురువారం ఈ ఉత్పత్తిని ప్రారంభించారు. హనీ ట్విగ్స్‌ పేరిట విడుదల చేసిన సాకెట్లో 8 మిల్లీలీటర్ల తేనె ఉంటుంది. ఒక బాక్స్‌లో 20 ప్యాకెట్లు ఉంటాయి.

ఏటా 90 మెట్రిక్‌ టన్నుల తేనె విక్రయం 
ఏటా గిరిజనుల నుంచి సేకరించిన తేనెను శుద్ధి చేసిన తర్వాత ‘గిరి హనీ’పేరిట కిలో, అరకిలో బాటిల్స్‌ రూపంలో దాదాపు 90 మెట్రిక్‌ టన్నుల మేర మార్కెట్లో విక్రయి స్తోంది. ఇందుకోసం ఆసీఫాబాద్‌లో జీసీసీ తేనె ప్రాసెసింగ్‌ యూనిట్‌ను తెరిచింది. ఈ ఏడాది హనీ ట్విగ్స్‌ రూపంలో 25 మెట్రిక్‌ టన్నుల తేనెను విక్రయించాలని లక్ష్యంగా జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘తేనెలో కార్బోహైడ్రేడ్లు్ల, విటమిన్‌ సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు సత్వర శక్తి పొందేందుకు ఉపయోగపడుతుంది. చాక్లెట్లు, బిస్కట్లు అందించే బదులుగా హనీ ట్విగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది’’అని జీసీసీ ఉన్నతాధికారి వి.సర్వేశ్వర్‌రెడ్డి సాక్షితో చెప్పారు.

మరిన్ని వార్తలు