‘తెలంగాణలో ట్రిపుల్‌ తలాక్‌’

1 Jun, 2018 16:32 IST|Sakshi

తెలంగాణలో ట్రిపుల్‌ తలాక్ కొనసాగుతోంది: కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ట్రిపుల్‌ తలాక్‌ ఆచారం కొనసాగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ట్రిపుల్‌ తలాక్‌ చట్టం అమల్లో ఉన్నా తెలంగాణలో మాత్రం ఆ ఆచారం కొనసాగుతోందని అన్నారు. ముస్లిం దేశమైన పాకిస్తాన్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలు తలాక్‌ని నిషేదించాయని, మనం ఎందుకు నిషేదించకుడదని ప్రశ్నించారు. ముస్లిం మహిళల అత్మగౌరవాన్ని కాపాడేందుకు రూపొందించిన తలాక్‌ బిల్లుకి పార్లమెంట్‌లో సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ  అడ్డుపడ్డారని విమర్శించారు.

మహిళలను వేధించిన వారికి ముడేళ్ల శిక్ష అన్ని మతాల వారికి వర్తింస్తుందని కేవలం మతం ఆధారంగా చుడరాదని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 15 లింగ సమానత్వం అందరికి వర్తిస్తుందని కేవలం మతం ఆధారంగా కఠిన చట్టాలు ఉండడానికి వీళ్లేదన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నిర్వహించిన సమావేశాల్లో రవిశంకర్‌ పాల్గొన్నారు. నాలుగేళ్ల కాలంలో మోదీ సర్కార్‌ సాధించిన విజయాలపై డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. కొద్ది కాలంలోనే మోదీ ప్రపంచ నేతగా ఎదిగారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు