ఒకే కాన్పులో ముగ్గురు

23 Aug, 2018 11:37 IST|Sakshi
ముగ్గురు శిశువులతో తల్లి పద్మ, స్టాఫ్‌నర్స్‌ విమల 

ములకలపల్లి : భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో బుధవారం ఓ తల్లి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. మండలంలోని చింతపేట గ్రామానికి చెందిన మడివి పద్మ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీలో ఉన్న స్టాఫ్‌నర్స్‌ విమల పద్మ రిపోర్టులను పరిశీలించి ముగ్గరు బిడ్డలు ఉన్నట్లు గుర్తించి, చాకచక్యంగా కాన్పు చేశారు.

పద్మకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడ శిశువు జన్మించారు. ఆమెకు ఇది రెండో కాన్పు కాగా, తొలి కాన్పులోనూ కవల పిల్లలకు జన్మనివ్వడం విశేషం. తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే శిశువులు బరువు తక్కువగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించామని వైద్యులు తెలిపారు. స్టాఫ్‌ నర్స్‌ విమలతో పాటు వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే, ట్రైకార్‌ చైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లు ఫోన్‌లో అభినందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు