ప్రజలపై భారం మోపిన టీఆర్‌ఎస్‌

15 Nov, 2018 16:28 IST|Sakshi

మంథని: తెలంగాణ ఆవిర్భావ సమయంలో రూ.16వేల కోట్ల మిగులు బడ్టెట్‌లో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. నాల్గున్నర సంవత్సరాల్లో రూ.లక్ష కోట్లకు పైగా అప్పులను ప్రజలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేసిందని కాంగ్రెస్‌ అభ్యర్థి డి.శ్రీధర్‌బాబు విమర్శించారు. మంథని మండలం కన్నాల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం పూజలు నిర్వహించారు. మంథనిలోని దత్తాత్రేయ, మహాలక్ష్మితోపాటు ఇతర దేవాలయాల్లో పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా నామినేషన్‌ వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన వెంట కిసాన్‌ ఖేత్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌కాచే, టీపీసీసీ కార్యదర్శి నాగినేజి జగన్‌మోహన్‌రావు, మంథని, ముత్తారం జెడ్పీటీసీలు మూల సరోజన, చొప్పరి సదానందం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతియాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిక...
మంథని: మంథని మండలం ఖాన్‌సాయిపేట గ్రామానికి చెందిన సుమారు 70 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కుడుదుల రాము ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొలకాని సమ్మయ్య, తాటి రాజయ్య, కొడిపే మల్లయ్య, సంతు, మల్లయ్య, దేవేందర్, రమేశ్‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి రోడ్డును చూస్తే తెలుస్తుంది..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియోజకవర్గంలో నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మంథని, పెద్దపల్లి ప్రధాన రహదారి చూస్తే తెలుస్తుందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. రామగిరి మండలం సెంటినరీకాలనీలోని శ్రీసాయి గార్డెన్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావడానికి వెళుతూ తెలంగాణ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి కమాన్‌పూర్‌ జెడ్పీటీసీ, తెలంగాణ ఉద్యమకారుడు గంట వెంకటరమణారెడ్డి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 

గంట ఆధ్వర్యంలో ఎంపీటీసీ ముల్మూరి శ్రీనివాస్, కమాన్‌పూర్‌ సింగిల్‌విండో చైర్మన్‌ బాద్రపు బాపు, సెంటినరీకాలనీ టౌన్‌ మాజీ అధ్యక్షుడు కాపరబోయిన భాస్కర్, మాజీ ఉప సర్పంచ్‌ సమ్మయ్య, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి కమాన్‌పూర్‌ మండల మహిళా అధ్యక్షురాలు అలుగు కృష్ణవేణి, నాయకులు కొయ్యడ సతీష్, మేకల మారుతి, ఎండీ జానీతోపాటు వివిధ పార్టీలకు చెందినవారు కాంగ్రెస్‌లో చేరారు. బుధవారంపేట మాజీ సర్పంచ్‌ బుచ్చన్న ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డితోపాటు 50 మంది చేరారు. మండల అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి బండారి సదానందం, టీపీసీసీ కార్యదర్శి నాగినేని జగన్‌మోహన్‌రావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతియాదవ్, జెడ్పీటీసీ చొప్పరి సదానందం, ఎంపీటీసీలు వనం రాంచందర్‌రావు, ముస్త్యాల శ్రీనివాస్, నాయకులు జగదీశ్వరావు, కర్రు నాగయ్య, గోమాస శ్రీనివాస్, శశిభూషన్‌కాచే తదితరులు పాల్గొన్నారు. 

ఇంటింటా ప్రచారం
రామగిరి మండలం లద్నాపూర్‌లో బుధవారం గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతి గుర్తుకు ఓటేయాలని గ్రామస్తులను కోరారు. ఎంపీటీసీ వనం రాంచందర్‌రావు, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ కలవేన శ్రీకాంత్, నాయకులు పుల్లెల్ల కొంరయ్య, కాల్వ శ్రీనివాస్, కన్నూరి వెంకటి, లింగయ్య, మాటేటి శ్రీనివాస్, తోకల రాకేష్, ఉగ్గె రమేశ్, సంగె మొండయ్య, పర్వతాలు, నూనేటి పోశమల్లు, మొగిళి సందీప్, శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరినవారితో శ్రీధర్‌బాబు 

మరిన్ని వార్తలు