దాస్యం: అభివృద్ధి చేశా.. గెలిపించండి

1 Dec, 2018 10:54 IST|Sakshi
ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌

సాక్షి, హన్మకొండ: నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముం దుంచానని తనను ఆశీర్వదించి గెలిపించాలని వరంగల్‌ పశ్చిమ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హన్మకొండలోని గాంధీ నగర్, అశోక కాలనీలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు వెంట రాగా శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహిం చారు. ఓటర్లను నేరుగా కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనను ప్రజలు ఆదరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనకు విజయాన్ని చేకూరుస్తాయన్నారు. వరంగల్‌ పశ్చిమలో విచిత్ర పోటీ నెలకొందన్నారు. స్థానికుడికి...స్థానికేతరుడికి జరుగుతున్న పోటీ అని అన్నారు. ప్రచారంలో రైతు విమోజన కమిషన్‌ చైర్మన్‌ నాగూర్ల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు జన్ను జకార్య, నల్ల సుదాకర్‌రెడ్డి,  సుందర్‌రాజు, నక్క లింగయ్య యాదవ్, జక్కుల రవి యాదవ్, బొల్లు రవి యాదవ్, శాగల్ల శ్రీనివా స్, బత్తిని శ్రీనివాస్, విప్లవ్‌రెడ్డి, బొల్లు సత్యం యాదవ్, మూగల కుమార్, బంక శ్రీనివాస్‌ యాదవ్, బంక అవినాష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు