'ప్రజాస్వామ్యాని'కి కుటుంబపాలనకు మధ్య పోరు

16 Nov, 2018 11:45 IST|Sakshi
మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌ 

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రజాస్వామ్యానికి కుటుంబపాలనకు జరుగుతున్న ఎన్నికల పోరులో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. 31వ డివిజన్‌ పరిధిలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మాజీ మేయర్‌ డి.శంకర్, నాయకులు ఆకుల ప్రకాష్, ఆమ ఆనంద్, చెర్ల పద్మ, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోడూరి మహేందర్‌గౌడ్, మోసిన్, బుచ్చిరెడ్డి, తాజొద్దీన్, ఉయ్యాల శ్రీనివాస్, రాచకొండ తిరుపతి, బొబ్బిలి విక్టర్, నడిపెల్లి అశోక్‌రావు, అంజన్‌కుమార్, సరిళ్ల ప్రసాద్‌  పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్‌కు చెందిన కోఆప్షన్‌ మెంబర్‌ కన్న కృష్ణ, వెల్గటూరు మాజీ జెడ్పీటీసీ జవ్వాజి తిరుపతి, రిటైర్డ్‌ సీపీవో కుక్కల లక్ష్మీరాజం, చందబాబు, రాకేశ్, చంద్రశేఖర్, కోటగిరి భద్రయ్య, కోలిపాక అశోక్‌తోపాటు తదితరులు కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  కాంగ్రెస్‌ నాయకులు కర్ర రాజశేఖర్, డి.శంకర్, ఆమ ఆనంద్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, గుండా చంద్రమౌళి, ఎస్‌ఆర్‌ శేఖర్, బుచ్చిరెడ్డి, తాజొద్దీన్‌ పాల్గొన్నారు.  

కేసీఆర్‌వి మోసపూరిత వాగ్ధానాలు
అపద్ధర్మ సీఎం కేసీఆర్‌వి మోసపూరిత వాగ్ధానాలేనని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారంరాత్రి మండలంలోని బహుదూర్‌ఖాన్‌పేట, తాహెర్‌ కొండాపూర్, చెర్లభూత్కుర్‌ గ్రామాల్లో పొన్నం ప్రభాకర్‌ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు.  కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మూల రవీందర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, ఆగయ్య, నాయకులు పర్శరాం, జక్కుల మల్లేశం,  అశోక్‌రెడ్డి, పోన్నం సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు