తెలంగాణ ఉత్సవంగా పీవీ జయంతి

24 Jun, 2014 20:16 IST|Sakshi
తెలంగాణ ఉత్సవంగా పీవీ జయంతి

హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28న తెలంగాణ వ్యాప్తంగా పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

అదే రోజు హన్మకొండలో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు టీఆర్ఎస్ నాయకుడు కెప్టన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఏకశిల విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కాగా, పీవీ నరసింహారావు జయంతి ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఈ రోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మరిన్ని వార్తలు