‘టీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాల అభ్యున్నతి’

1 Dec, 2018 14:30 IST|Sakshi
ర్యాలీలో పాల్గొన్న గంగుల కమలాకర్‌    

కాంగ్రెస్, బీజేపీలను నిలదీయండి

కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ 

సాక్షి,కొత్తపల్లి: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని సాలెహ్‌నగర్, హనుమాన్‌నగర్, ద్వారకానగర్, గౌడ కాలనీ, షేకాబీకాలనీల్లో మాజీ సర్పంచ్‌ నందెల్లి ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్‌ సుదగోని కృష్ణ కుమార్‌ గౌడ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం కమలాకర్‌కు డప్పు చప్పుళ్లు, మంగళహారతులు,  పూలతో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పలు మసీదుల్లో ముస్లింను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సభల్లో గంగుల మాట్లాడుతూ ఐదేళ్లుగా కనిపించని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఎందుకు పట్టించుకోలేదో నిలదీయాలని కోరారు.

మహాకూటమి రూపంలో చంద్రబాబు తెలంగాణ గడ్డపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రా దొంగలు పడేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కొనసాగాలంటే ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్‌ జమీలొద్దీన్, ఎంపీటీసీ శేఖర్, టీఆర్‌ఎస్‌వీ నాయకుడు పొన్నం అనీల్‌గౌడ్, మాజీ వార్డుసభ్యులు ఎస్‌.నారాయణగౌడ్, మాజీద్, రహీం, రాచకొండ నరేశ్, పొన్నాల తిరుపతి, అస్తపురం నర్సయ పాల్గొన్నారు.

పలువురి చేరిక
రేకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సీనియర్‌ సీనియ ర్‌ నాయకులు అస్తపురం అంజయ్య, నెల్లి చంద్ర య్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రవీందర్‌లు గంగుల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు 

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?

వైఎస్సార్‌సీపీకే మద్దతు