ఆఖరి వరకు అటెన్షన్‌

22 Jan, 2020 02:03 IST|Sakshi

వార్డులు, డివిజన్లవారీగా టీఆర్‌ఎస్‌ సమన్వయం

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అఖరి నిమిషం వరకు అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రెబెల్స్, విపక్ష అభ్యర్థులకు చెక్‌ పెట్టేందుకు ప్రతి వ్యూహాలకు పదునుపెట్టింది. వార్డులు, డివిజన్ల వారీగా పార్టీ ఎమ్మెల్యేలను సమ న్వయపరుస్తోంది. పురపాలికల వారీగా పార్టీ పరి స్థితిపై ఇన్‌చార్జీలు ఎప్పటికప్పుడు అధిష్టానా నికి నివేదికలు పంపిస్తున్నారు. రెబెల్స్‌ సమస్య అధికం గా ఉన్న పురపాలికలపై మంత్రులు దృష్టి పెట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెలంగాణ భవన్‌ నుం చి పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, నవీన్‌రావు తదితరులతో కూడిన సమన్వయ కమిటీ క్షేత్రస్థాయిలోని అభ్యర్థులు, నేతలతో సం ప్రదింపులు జరుపుతూ అవసరమైన సహకారం అందిస్తున్నారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూ ఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లిన టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు.. అక్కడి నుంచే ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు చివరి నిమిషంలో అనుసరించే వ్యూహాలను ఛేదించేం దుకు టీఆర్‌ఎస్‌ కలసికట్టుగా శ్రమిస్తోంది. రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌కు 60 లక్షల సభ్యత్వాలుండగా మున్సిపాలిటీల్లో 16లక్షల మంది సభ్యులుండటం ఆ పార్టీకి ఎన్నికల్లో కలసివచ్చే అంశం. పార్టీ బల గం, పథకాల లబ్ధిదారులు, సామాజిక సమీకర ణాలు పార్టీ అభ్యర్థులకు ఓట్లు తెచ్చి పెడతాయనే నమ్మకంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉంది.

ఎమ్మెల్యేలపై ఒత్తిడి...
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలి పించుకునే బాధ్యతను ఎమ్మెల్యేల భుజస్కంధా లపై పార్టీ అధిష్టానం పెట్టింది. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని బీ–ఫారాల పంపిణీ, ప్రచార బాధ్య తల వరకు అన్నీ ఎమ్మెల్యేలపై పెట్టడంతో వారు కొంత ఒత్తిడి ఎదుర్కొన్నారు. గెలుపును ప్రతిష్టా త్మకంగా తీసుకుని ప్రచారపర్వం ముగిశాక కూడా స్థానికంగా మకాం వేసి క్షేత్రస్థాయి పరిస్థితికి అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్రం లోని 80 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు బుధ వారం ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు ఈ ఎన్నికలు గీటురాయిగా మారనున్నాయి. పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారింది. ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించడంతోపాటు భవిష్యత్తులో పదవులు పొందడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ఈ నెల 25న ఫలితాల వెల్లడి సందర్భంగా తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్సీలు, ఎంపీలకు అధిష్టానం ఆదేశించింది.

అందరి దృష్టి ఇక్కడే..
కొల్లాపూర్, రామగుండం, తాండూరు తదితర పురపాలికల్లో అంతర్గత కుమ్ములాటలు టీఆర్‌ఎస్‌ గెలుపోటములుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అందరి దృష్టి ఈ స్థానాలపైనే ఉంది. ముఖ్యంగా రెబెల్స్‌ బెడద అధికంగా ఉన్న కొల్లాపూర్‌ పురపాలికపై మంత్రి నిరంజన్‌రెడ్డి, తాండూరు పురపాలికపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతోపాటు రెబెల్స్‌ దాదాపు అన్ని డివిజన్లలో సింహం గుర్తుపై పోటీలో ఉండటం ఉత్కంఠ రేపుతోంది.

రాజధాని శివార్లలో ప్రతిష్టాత్మకం
హైదరాబాద్‌ శివార్లలోని 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీల్లో పార్టీ గెలుపును టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. ఓటింగ్‌ శాతం పెరిగితే అన్ని చోట్లా గెలుపు తమదేనని అధిష్టానం భావిస్తోంది. కేటీఆర్‌ సూచనల మేరకు శివారు పురపాలి కల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా స్థానిక నేతలు ప్రజలను చైతన్యపరుస్తున్నారు. పోలింగ్‌ రోజు న గంటగంటకు ఓటింగ్‌ సరళిని సమీక్షిస్తూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేలా పనిచేయా లని స్థానిక నాయకత్వం నిర్ణయించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా