శారదాపీఠానికి కేటాయించిన భూ పత్రాలు అందజేసిన కేసీఆర్‌

26 Jun, 2019 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్వామి స్వాత్మానందేంద్ర శారదాపీఠం ఉత్తరాధికారిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారితో కలిసి హైదరాబాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జలవిహార్‌లో గురువందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు స్పీకర్‌, మంత్రులు కూడా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో శారదాపీఠానికి కేటాయించిన భూమి పత్రాలను కేసీఆర్‌ స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు. కార్యక్రమంలోభాగంగా  స్వాత్మానందేంద్ర, స్వరూపానందేంద్ర స్వాములకు పుష్పాభిషేకం చేశారు.

మరిన్ని వార్తలు