16 మంది కొత్త ఎమ్మెల్సీలు

24 Jan, 2019 03:20 IST|Sakshi

మొదటి వారంలో అభ్యర్థుల ప్రకటన.. అందరి పేర్లూ ఒకేసారి వెల్లడి!

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలో ఖాళీ అయిన, పదవీ కాలం పూర్తవుతున్న స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టి సారించింది. ఒకేసారి 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో టీఆర్‌ఎస్‌లోని చాలా మంది అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ దక్కని వారు తమకు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కోరుతున్నారు. జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణల ఆధారంగా ఆశావహుల పేర్లను పరిశీలిస్తున్నా రు. రాష్ట్ర శాసనమండలిలో ఉన్న 40 స్థానాల్లో ఒకేసారి 16 ఖాళీ అవుతున్నా యి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల తర్వాత పదవికి రాజీనామా చేశారు. ఇలా 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆర్‌.భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డి, ఎస్‌.రాములునాయక్‌లపై అనర్హత వేట కారణంగా మరో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. మార్చి ఆఖరుకు 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోంమంత్రి మహమూద్‌ అలీ (టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ సలీం (టీఆర్‌ఎస్‌), టి.సంతోష్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌), షబ్బీ ర్‌అలీ (కాంగ్రెస్‌). 

పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్‌), హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు (టీఆర్‌ఎస్‌), కరీంనగర్, మెదక్, ఆదిలాబా ద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌ (టీఆర్‌ఎస్‌), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్‌ (స్వతంత్ర) పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు జాబితా సిద్ధం చేస్తోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉం ది. షెడ్యూల్‌ విడుదలవగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించనుంది.   

మరిన్ని వార్తలు