నాపై ఆరోపణలా.. క్షమాపణ చెప్పండి

6 Mar, 2018 11:22 IST|Sakshi

అవినీతిపరుల పక్కన నిలబడి తప్పుడు విమర్శలు చేయడం సరికాదు

మంత్రులకు దీటుగా  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా..

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి

సాక్షి వనపర్తి: ఎన్నికల్లో గెలిచినా.., ఓడినా ని యోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మంత్రుల నియోజకవర్గాలకు దీటుగా అభివృ ద్ధి చేస్తున్న తనపై ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు రేవంత్‌రెడ్డి తప్పుడు విమర్శలు చే యడం సరికాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తిలో ఆదివారం నిర్వహించిన వనపర్తి సింహగర్జనలో తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన సింగిరెడ్డి సోమవారం స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. తప్పుడు విమర్శలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తనకు ఉన్న మూడు కోరికల్లో రాష్ట్ర ఏర్పాటు, జిల్లాల ఏర్పాట్లు రెండూ నెరవేరాయని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఇక చివరిదైన జిల్లా కార్యాలయాల నిర్మాణం చురుగ్గా సాగుతోందన్నారు. కాగా, తాను ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటున్నానని.. చిన్నారెడ్డి మాత్రం ఓడిపోతే పారిపోతూ.. గెలిచాక నాటకాలాడు తూ పబ్బం గడుపుకుంటున్నారని మండి పడ్డారు. ఇక చిన్నారెడ్డికి ఆరు ఇళ్లు, ఏ సంపాదన లేని ఆయన కొడుకు పేరిట రంగాపూర్‌లో భూమి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. 1984నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న తాను నిరుపేదల తరఫున ఉచితంగా వాదిస్తూ.. ఐటీ రిటరŠన్స్‌ చెల్లించే స్థాయికి వచ్చానే తప్పా.. ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదన్నారు.

 పెద్ద నోట్లను రద్దు చేసిన రోజు తాను కనిపించకుండా పోయి 29కిలోల బంగారం కొన్నట్లు చేసిన విమర్శల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఆ రోజు హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. రేవంత్‌రెడ్డిని 2003 నవంబర్‌లో తానే టీఆర్‌ఎస్‌లో చేర్పించానని.. అలాంటి వ్యక్తి పార్టీలు మారి, ఓటుకు నోటు కేసులో పట్టుబడగా.. ఆయన పక్కన నిలబడి చిన్నారెడ్డి తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. పొద్దున లేస్తే నీతి మాటలు చెప్పే చిన్నారెడ్డికి రేవంత్‌ పక్కన నిలబడడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో చిన్నారెడ్డిని ఓడించి తగిన బుద్ధి చెబుతానని స్పష్టం చేశారు.

 ఇక తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే మీడియా ఎదుట చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్లు రవి, బుచ్చారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయకర్త జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ శంకర్‌నాయక్, కౌన్సిలర్లు శ్రీధర్, లోక్‌నాథ్‌రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు