ఆంధ్రానేతలతో కలసి వ్యాపారం చేస్తే తప్పేంటి?

6 Sep, 2014 11:16 IST|Sakshi
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ బాల్క సుమన్

మెదక్ : తెలంగాణ టీడీపీ నాయుకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా ప్రతినిధిగా రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని వారు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీనగర్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో రేవంత్రెడ్డి చేసిన పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు తెలిపారు. పలు కేసుల్లో నిందితులతో రేవంత్కు సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శించారు. త్వరలో రేవంత్ బండారం బయటపడతామని వారు హెచ్చరించారు. కొడంగల్ ప్రజా కోర్టులో చర్చకు సిద్ధమా అంటూ రేవంత్కు సవాల్ విసిరారు.

మెదక్ ఉపఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వారు జోస్యం చెప్పారు. ఆంధ్రానేతలతో కలిసి వ్యాపారం చేస్తే తప్పేంటని వారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీన్ని రాద్ధాంత చేయడం తగదని హితవు పలికారు. రేవంత్రెడ్డి కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బు వసూల్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై చేసిన విమర్శలను వెంటనే నిరూపించాలని రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు. రాజకీయ అసూయతోనే రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్ తెలిపారు.

మరిన్ని వార్తలు