చెన్నమనేని అప్పీల్‌ ఉపసంహరణ 

22 Aug, 2019 02:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పౌరసత్వ వివాదం కేసులో సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సింగిల్‌ జడ్జి ఆదే శాల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించడంతో అప్పీల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకట రమణ కోరారు. అందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం బుధవారం అనుమతించింది. భారత పౌరసత్వం పొందేందుకు చెన్నమనేని వాస్తవాలనే తెలిపారని, తప్పుడు సమాచారం ఇచ్చారనే ఫిర్యా దులోని అంశాలు అసత్యాలని న్యాయవాది వాదిం చారు.  రాజకీయ ప్రత్యర్థులే పిటిషనర్‌పై ఫిర్యా దులు చేస్తున్నారన్నారు. అప్పీల్‌ పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని, సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే అంతా ఆమోదయోగ్యంగానే ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయ పడింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని న్యాయవాది కోరడంతో అందుకు ధర్మాసనం అనుమతిచి్చంది. 

మరిన్ని వార్తలు