‘గిన్నీస్లో ఎక్కేలా బతుకమ్మ వేడుక’

28 Sep, 2016 17:16 IST|Sakshi
‘గిన్నీస్లో ఎక్కేలా బతుకమ్మ వేడుక’

హైదరాబాద్ : బతుకమ్మ వేడుక గిన్నీస్ బుక్లో ఎక్కే విధంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత  అన్నారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ 30వేల మందితో బతుకమ్మ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో 1100 చోట్ల, 9 దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. కాగా తెలంగాణ జాగృతి యాప్ను ఎంపీ కవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందన్ని, తెలంగాణ జాగృతి యాప్ను లాంచ్ చేయడం గర్వంగా ఉందన్నారు. యాప్ ద‍్వారా తమ సంస్థ  గ్రాస్ రూట్ లెవల్లో పని చేయగలుగుతుందన్నారు. ఇక  వరద విషయాన్ని విపక్షాలు రాజకీయం  చేయడం తగదని ఎంపీ కవిత పేర్కొన్నారు. రెండు, మూడు కాలనీల్లో నీళ్లొస్తే హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలని కొంతమంది దుష్ప్రచారం చేశారన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య  నాయుడు తెలంగాణలో కూడా పర్యటించి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు. కాగా ఈ నెల 30న యూఏఈలో బతుకమ్మ ఉత్సవాలకు కవిత హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు