వేదపండితుల పంచాంగ శ్రవణంలో కవిత  

7 Apr, 2019 04:16 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌:  ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ, నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కవిత నక్షత్రం భరణి, మేషరాశికి ఈసారి కందాయ ఫలములు బేసి సంఖ్యలో రావడం ధన లాభాన్ని, అన్ని కార్యాల్లో జయమును సూచిస్తుందని వేద పండితులు కాందలై గోపాలాచార్యులు పేర్కొన్నారు.

ఆదాయం 14, వ్యయం 14 ఉంటుందని, రాజ్యపూజ్యం మూడు, అవమానం ఆరు ఉందని పండితులు పేర్కొన్నారు. ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా మద్దతు పెరుగుతోందని పండితులు పేర్కొన్నారు. తెలంగాణను చాలా కాలం పాలించే యోగం టీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. అంతకుముందు రాములవారికి కవిత పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు