వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే 

23 Nov, 2018 16:57 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు   

మాజీ మంత్రి జలగం ప్రసాదరావు

గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం   

సాక్షి,సత్తుపల్లి: భూ నిర్వాసితుల సమస్యలు తెలుసు. కొంతమంది అధికారుల తప్పిందం వల్ల గ్రామం పోతోంది. సీఎం కేసీఆర్, సింగరేణి సీఎండీలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని, వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. మండలంలోని కొమ్మేపల్లి, యాతాలకుంట, చెరుకుపల్లి, కిష్టారం గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. నిర్వాసితులకు జగన్నాథపురంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడుతున్న తరహాలోనే కొమ్మేపల్లి నిర్వాసితులకు కూడా ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని, రూ.1.30 లక్షలు ఎటూ సరిపోవన్నారు. సీఎం కేసీఆర్‌ ఖమ్మం సభలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారని మొట్ట మొదటిసారిగా చెప్పారన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేటప్పుడే.. గిరిజనులు, దళితులు, పేదల సంక్షేమం కోసం పోడు కొట్టుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరానన్నారు.
కొమ్మేపల్లి పట్టా భూముల సమస్యలను కేసీఆర్‌కు చెప్పి సత్వర పరిష్కారం అయ్యేలా చేస్తానని.. ఏ పనులు జరగాలన్నా.. కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. చెరుకుపల్లిలో పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని గిరిజనులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యుడు మట్టా దయానంద్, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, చల్లగుళ్ల నర్సింహారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సోమరాజు సీతారామారావు, మోరంపూడి ప్రభాకర్, తుమ్మూరు శ్రీనివాసరావు, అమరవరపు కృష్ణారావు, కొడిమెల అప్పారావు, జ్యేష్ట లక్ష్మణరావు, ఐ. శ్రీను మొదుగు పుల్లారావు, ఎండీ యాసీన్, మౌలాలీ, షఫీ, సుభాని పాల్గొన్నారు.
 
కారు గుర్తుకు ఓటేయండి   
సత్తుపల్లి: టీఆర్‌ఎస్‌ పార్టీని బలపర్చి కారుగుర్తుకు ఓటేయండని డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు కోరారు. పట్టణంలోని జవహర్‌నగర్‌లో గురువారం టీఆర్‌ఎస్‌లో చేరిన తన్నీరు వెంకటేశ్వరరావు, అరవపల్లి అమరయ్య, దుర్గారావు, మల్లీశ్వరి, తులశమ్మ, దానియేలు, లేయమ్మ, శివమ్మ, షారుక్, జయమ్మ, కమలమ్మలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం పని చేసిందని.. ఆసరా పెన్షన్లు రూ.2,016, వికలాంగుల పెన్షన్లు రూ.3,016లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ రూ.1,0116లు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌దేనన్నారు. ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కారుగుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్య, దొడ్డాకుల స్వాతిగోపాలరావు, కోటగిరి వెంకటరావు, రామకృష్ణ, విష్ణు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు