హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌

25 Jul, 2019 02:52 IST|Sakshi
బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో భోజనం వడ్డిస్తున్న హిమాన్షు

ఘనంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌ పుట్టినరోజు వేడుకలు 

పలువురు ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేటీఆర్‌ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సినీపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, ఆయనతో కలిసి తీయించుకున్న ఫొటోలను ట్యాగ్‌ చేశా రు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం లో పలువురు రక్తదానం చేశారు. శాసనసభ అవరణలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేశారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటి పరిధిలో వెయ్యి మొక్కలు నాటారు. ఇక బహ్రెయిన్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ ఆధ్వర్యంలో గుడైబియా ఆండాల్స్‌ గార్డెన్‌లోనూ మొక్కలు నాటి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు జరిపారు. 

గిఫ్ట్‌ ఏ స్మైల్‌కు అపూర్వ స్పందన.. 
కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆయన అభిమాను లు చేపట్టిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమానికి భారీ స్పం దన వచ్చింది. కేటీఆర్‌ అనుచరులు, అభిమానులు, మిత్రులు, సన్నిహితులు తమ వంతుగా ఏదో ఒక మంచి పని చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానాలు, పుస్తకాలు, సైకిళ్ల వితరణ, హరితహా రం, విద్యార్థులకు ఆర్థిక సాయం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన వంతుగా విద్యార్థులకు ఇంగ్లిష్‌ డిక్షనరీలు పంచారు. వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ముగ్గురికి ఆర్థిక సహాయం అందజేశారు. తన నియోజకవర్గానికి చెందిన వి.నవ్య అనే పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం, తెలంగాణ ఉద్యమం సందర్భంగా గాయపడిన శివ, రాజులకు రూ.లక్ష చొప్పున సాయం చేశారు. కాగా, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి, గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద సమాజ సేవ చేసిన అందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.  

సేవా కార్యక్రమాల్లో హిమాన్షు.. 
తన తండ్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించారు. రహమత్‌ నగర్‌లోని కుమార్‌ స్కూల్‌ విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో కేటీఆర్‌ పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు