టీఆర్‌టీ ఫలితాలు విడుదల

12 Oct, 2019 03:06 IST|Sakshi

3,325 ఎస్జీటీ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక

15 రోజుల్లో పోస్టింగ్‌ల షెడ్యూలు

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) తెలుగు మీడియం పోస్టుల భర్తీకి చేపట్టిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 3,325 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 2017లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తంగా 3,786 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. మరో 910 ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం పోస్టుల భర్తీ కోసం 2018 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు టీఎస్‌పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం ఫలితాలు వెల్లడించింది. దీంతో రీలింక్విష్‌మెంట్‌ తీసుకోవాలంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టుల అవసరం లేని వారు రీలింక్విష్‌ మెంట్‌ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఆ మేరకు అభ్యర్థులు కొందరు రీలింక్విష్‌మెంట్‌ ఇచ్చారు.

ఆ తర్వాత ఏప్రిల్‌ మొదటి వారంలో ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలు వెల్లడించిం ది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్‌ మీడి యం పోస్టులు వస్తే అవి వద్దంటూ రీలింక్విష్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాలంటూ మరికొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మళ్లీ రీలింక్విష్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాల్సి రావడంతో తుది ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఎట్టకేలకు శుక్రవారం 3,325 ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు అభ్య ర్థులను ఎంపిక చేసింది. వికలాంగుల కేటగిరీకి సంబంధించి విద్యాశాఖ నుంచి రావాల్సి ఉన్నందున 270 పోస్టుల ఫలితాలను తర్వాత ప్రకటి స్తామని పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతా నికి సంబంధించిన అంశాల్లో కోర్టు వివాదాలు ఉన్నందున 117 పోస్టుల ఫలితాలను విత్‌ హెల్డ్‌లో పెట్టింది.

మరోవైపు వివిధ కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లభించనందున 74 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మొత్తానికి 3,325 పోస్టుల ఫలితాలను వెల్లడించింది. ఈ జాబితాను త్వరలోనే తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మరోవైపు ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడిసా ్తమని టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత గ్రూప్‌–2 ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించాయి. టీఎస్‌పీఎస్సీ ఫలితాలు విడుదల చేయడంతో తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధం అవు తోంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు 15 రోజుల్లో షెడ్యూలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి సబిత విద్యాశాఖ, టీఎస్‌పీఎస్సీ అధికారులతో చర్చించిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆగని మర్కజ్‌ కేసులు 

లాక్‌డౌన్‌ కొనసాగించాలి

గాంధీ వైద్యులు గ్రేట్‌..

జూలో జంతువులు సేఫ్‌

లాక్‌డౌన్‌ మంచిదే..

సినిమా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు