ఆరు వారాల గడువివ్వండి

19 Nov, 2016 02:20 IST|Sakshi
ఆరు వారాల గడువివ్వండి

అఫిడవిట్ సమర్పణకు బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను కోరిన రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89పై అభిప్రాయాలను నాలుగు వారాల్లో తెలపాలన్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం అదనపు గడువు కోరింది. ట్రిబ్యునల్ విధించిన గడువు శనివారంతో ముగియడంతో అఫిడవిట్ సమర్పణకు మరో ఆరు వారాల గడువు కావాలని విన్నవించింది. ఈమేరకు ఢిల్లీలో ఉన్న అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు.. ట్రిబ్యునల్ కార్యాలయ అధికారులకు తమ వినతిని అందించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 పరిధి, విసృ్తతిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా గల ట్రిబ్యునల్ గత నెలలో తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కృష్ణా జలాల కేటారుుంపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవాలని ఇందులో స్పష్టం చేసింది. నీటి కేటారుుంపులు, ప్రాజెక్టుల వారీ కేటారుుంపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్(ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి) తెలంగాణ, ఏపీకే పరిమితమని తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటారుుంపులు, ప్రాజెక్టు వారీ కేటారుుంపులు, ఆపరేషన్ ప్రోటోకాల్ తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్ 14న చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై ఏపీ, తెలంగాణ నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది.

వాటికి జవాబులను తదుపరి రెండు వారాల్లో సమర్పించాలని, తిరిగి వాటిపై ఏవైనా ప్రతిస్పందనలు ఉంటే వారంలోగా సమర్పించాలంటూ ఉత్తర్వుల్లో తెలిపింది. దీనిపై ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై స్పష్టత రాకపోవడంతో రాష్ట్రం మరో ఆరు వారాల గడువు కోరింది. ఈ నేపథ్యంలో డిసెంబర్14న జరగాల్సిన ట్రిబ్యునల్ భేటీ సైతం వారుుదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు