అత్యుత్తమ సేవల్లో నం.1

21 Jun, 2018 02:05 IST|Sakshi

హైదరాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి మొదటి స్థానం  

ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌: ‘ఏ’కేటగిరీ పాస్‌పోర్టు కార్యాలయాల్లో (ఏడాదికి 5 లక్షలకు పైగా పాస్‌పోర్టులు అందించేవి) ఒకటైన హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అత్యుత్తమ సేవలు అందించి 2017– 18 సంవత్సరానికి మొదటి స్థానం దక్కించుకుంది. బుధవారం సికింద్రాబాద్‌లో హైదరాబాద్‌ ప్రాంతీ య పాస్‌పోర్ట్‌ అధికారి డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి మీడి యాకు వివరాలు వెల్లడించారు. వేగంగా పాస్‌పోర్టు అందించడం, పెండింగ్‌లను తగ్గించడం, ఫిర్యాదులను పరిష్కరణ తదితర అంశాలను పరిశీలించి విదేశీ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రకటించినట్లు చెప్పా రు.

పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ను కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేస్తున్న రాష్ట్ర పోలీసులు కూడా అత్యుత్తమ సేవల్లో మొదటి స్థానం దక్కించుకున్నారన్నారు. మూడోసారి రాష్ట్ర పోలీసులు ఈ అవార్డు అందు కుని హ్యాట్రిక్‌ సాధించారన్నారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే అఖిల భారత పాస్‌పోర్టు అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ అవార్డును అందిం చనున్నట్లు వివరించారు.

అలాగే, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించిందన్నారు. దేశంలో మొత్తం 214 పీవోపీఎస్‌కేలు ఉండగా రాష్ట్రంలో 7, ఏపీలో 13 ఉన్నాయన్నారు. పీవోపీఎస్‌కేల్లో దరఖాస్తు తీసుకుంటున్నా.. అవి హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చాకే జారీ ప్రక్రియ జరుగుతుందన్నా రు. ఈ జాప్యాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొదట వరంగల్‌లోని పీవోపీఎస్‌కేను ఇలా మారుస్తున్నామన్నారు.  

మరిన్ని వార్తలు