సెట్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు 

27 May, 2020 03:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్‌ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈనెల 31 నుంచి జూన్‌ 10 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూలైలో అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంసెట్, ఈసెట్, పీజీఈ సెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలా సెట్, ఐసెట్, పీఈసెట్‌కు హాజరయ్యేందుకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చేనెల 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆ తరువాత ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు