పవర్‌ గ్రిడ్‌పై ప్రభావం ఉండదు: ప్రభాకర్‌ రావు

4 Apr, 2020 12:57 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చీకట్లను తరిమికొట్టడానికి దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్‌ లైట్లు తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని  తాజా పిలుపుపై విపక్షనేతలు, విద్యుత్తు ఇంజనీర్లు, నిపుణుల నుంచి విమర్శలు చెలరేగుతున్నాయి. ఒకేసారి అన్ని లైట్లను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పవర్‌ గ్రిడ్ వైఫల్యానికి దారితీయనున్నట్లు విద్యుత్‌ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు శనివారం స్పందించారు. (లైట్లన్నీ ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో లైట్లు ఒకేసారి ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్‌ గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభాకర్‌ రావు  స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఎటువంటి అవాంతరాలు జగరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పవర్‌ గ్రిడ్‌కు ఏ సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు. కరోనా  కట్టడికి.. ప్రధాని మోదీ పలుపును విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణ ప్రవర్‌ గ్రిడ్‌ సురక్షితంగా ఉందని ఆయన పేర్కొన్నారు.  ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలని ప్రభాకర్‌ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. (9 గంటలకు.. 9 నిమిషాల పాటు)

మరిన్ని వార్తలు