3.144 % డీఏ పెంపు

7 Nov, 2019 04:38 IST|Sakshi

30.392% నుంచి 33.536 శాతానికి పెరిగిన డీఏ

2019, జనవరి 1 నుంచి పెంపు వర్తింపు 

నవంబర్‌ వేతనంతో కలిపి పెరిగిన డీఏ డిసెంబర్‌లో చెల్లింపు

జీపీఏ ఖాతాలో పాత పెన్షన్‌ ఉద్యోగుల డీఏ బకాయిలు జమ

సీపీఎస్‌ ఉద్యోగులకు డిసెంబర్‌లో 90% బకాయిల చెల్లింపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం (డీఏ) పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మూల వేతనంపై కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెరిగింది. 2019, జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. వచ్చే డిసెంబర్‌లో చెల్లించనున్న ప్రస్తుత నవంబర్‌ వేతనంతో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.డీఏ బకాయిల చెల్లింపు ఇలా..: 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్‌ 31 మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జనరల్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది.

2020, ఫిబ్రవరి 29కి ముందు పదవీ వివరణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది. 2004, సెప్టెంబర్‌ 1 తర్వాత నియామకమై కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) వర్తించే ఉద్యోగులకు 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్‌ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్‌ ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్‌ 2019లో నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్‌ ఖాతాలకు అనర్హులైన ఫుల్‌ టైం కాంటిజెంట్‌ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్‌లో నగదు రూపంలో చెల్లించనుంది.

2015, పీఆర్సీ ఉద్యోగులకు..: 2015, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్‌ చార్జీడ్‌ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్‌ సంస్థలు, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్‌ కె.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెంపు వర్తించనుంది.   2010, పీఆర్సీ ఉద్యోగులకు ..: జీవో 36 ఆధారంగా 2010, పీఆర్సీ వేతనాలు అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 112.992 శాతం నుంచి 118.128 శాతానికి పెరిగింది.

అదే విధంగా 2010, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్‌ చార్జీడ్‌ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్‌ సంస్థలు, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్‌ కె.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం 112.992 శాతం నుంచి 118.128 శాతం డీఏ పెంపు వర్తించనుంది. జీవో నం.171 ప్రకారం.. వేతనం రూ.3850 నుంచి రూ.6700కు పెరిగిన ఫుల్‌ టైం కాంటింజెంట్‌ ఉద్యోగులకు సైతం ఇదే పెంపు వర్తిస్తుంది.

2006 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 148 శాతం నుంచి 154 శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్‌ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్‌ కె.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది.2016 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 9 శాతం నుంచి 12 శాతానికి ప్రభుత్వం పెంచింది.

యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్‌ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ, జేఎన్టీయూహెచ్‌తోపాటుఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఇది వర్తిస్తుంది.  వేతన సవరణ–2010 ప్రకారం వేతనాలు పొందు తున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 112.992 శాతం నుంచి 118.128 శాతానికి ప్రభుత్వం పెంచింది.  పార్ట్‌ టైం విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ.100 వేతనం పెరిగింది. పెన్షనర్ల డీఏపై  గురువారం ఉత్తర్వులిచ్చే అవకాశముంది.

మరిన్ని వార్తలు