రహస్యంగా ‘శ్రామిక్‌’ రైళ్లు

6 May, 2020 03:25 IST|Sakshi

తెల్లవారుజామున బయలుదేరేలా ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: వలస కార్మికుల తరలింపు వ్యవహారాన్ని ప్రభుత్వం రహస్యంగా నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపాలని కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 4 రోజు ల క్రితం జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన 1,225 మంది కార్మికులతో తొలి రైలు లింగంపల్లి స్టేషన్‌ నుంచి నడిచింది. సోమవారం తెల్లవారుజామున మూ డున్నరకు ఘట్కేసర్‌ స్టేషన్‌ నుం చి 1,248 మందితో బిహార్‌లోని ఖగారియాకు రెండో రైలు పయనమైంది.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికులను 55 ఆర్టీసీ బస్సుల్లో సోమవారం అర్ధరాత్రి 12 నుంచి ఘట్‌కేసర్‌ తరలించారు. ప్రతి ప్రయాణికు డూ మాస్క్‌లు ధరించేలా చర్య లు తీసుకున్నారు. అధికారులే వారికి భోజనం, వాటర్‌ బాటిళ్లను అందజేశారు. ఈ రైళ్లో చార్జీలపై కేంద్రం కొంత రాయితీ ఇవ్వగా.. మిగిలిన చార్జీల ను రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఇక రోజూ 45–48 వేల మందిని తరలించేలా సర్కారు ఏర్పాట్లు చే స్తోంది. బుధవారం ఉదయం నడిచే శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో తరలించేందుకు మంగళవారం సాయంత్రానికి ఆర్టీసీ 1,300 బస్సులను సిద్ధం చేసింది. ఈ రైళ్లలో వెళ్లే వలస కూలీల చార్జీల కింద ప్రభుత్వం రూ.4 కోట్లను అడ్వాన్సుగా చెల్లించింది.

అంతా గోప్యమే..: నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగులు, వ్యా పారులు వీరిలో ఉన్నారు. వీరంతా దాదాపు ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇలాంటి వారికి స్వస్థలాలకు వెళ్లే అవకాశం లేదు. కేవలం వలస కూలీలు, విద్యార్థులు, లాక్‌డౌన్‌ వేళ చిక్కుపడిపోయిన పర్యాటకులకే అనుమతి ఉంది. ఇలాంటి వారు దాదాపు ఏడెనిమిది లక్షల మంది ఉన్నారు. ఇందులో 99 శాతం మంది వలస కార్మికులే. వీరిలో సింహభాగం స్వస్థలాలకు వెళ్లాలని సిద్ధపడ్డారు. కానీ, ఉద్యోగ, వ్యాపార పనుల్లో ఉన్నవారిలో కూడా కొందరు స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్నారు.

కానీ వారిని ప్రభుత్వం అ నుమతించటం లేదు. వలస కార్మికుల తరలింపు వేళ వారు కూడా తమకు అవకాశం కల్పించాలంటూ పె ద్దసంఖ్యలో పోలీసుస్టేషన్ల కు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. దీన్ని నివా రించేందుకు శ్రామిక్‌ రైళ్లను నడిపే విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. కార్మికులు ఏ ప్రాంతానికి వెళ్లాలో, ఎంతమంది ఉంటారో ముందే నిర్ణయించి రాత్రి పొద్దుపోయాక, రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు  రైల్వే నోడ ల్‌ అధికారికి చెబుతున్నారు. దీంతో సదరు స్టేషన్‌లో అప్పటికప్పుడు రైలును సిద్ధం చేసి ఉంచుతున్నారు. ఫలితంగా వలస కార్మికుల తరలింపు కార్యక్రమం అవాంతరాలు లేకుండా సాఫీగా సాగుతోంది. 

వలసకూలీలతో బయల్దేరుతున్న శ్రామిక్‌ రైలు

మరిన్ని వార్తలు