కరోనా; వాళ్లందరి వివరాలు ఇవ్వండి: సర్కారు

18 Mar, 2020 18:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యా సంస్థలను మార్చి 31 వరకు బంద్‌ చేయాలన్న సర్కారు... మ్యారేజ్‌ హాల్స్‌ మూసివేయాలని, పబ్లిక్‌ ఈవెంట్లు అన్నింటినీ రద్దు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరుకోగా.. వారు ప్రయాణించిన రవాణా మార్గాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.(తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు)

ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి రామగుండానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో సర్కారు అప్రమత్తమైంది. అతడితో ప్రయాణించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ డిప్యూటీ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌కు ఈ మేరకు లేఖ రాసింది. బాధితుడు మార్చి 13న ఢిల్లీ నుంచి బయల్దేరి ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌9 కోచ్‌లో ప్రయాణించి మరుసటి రోజు రామగుండం చేరుకున్నాడని పేర్కొంది. అతడికి రక్త పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొంది. కావున అతడితో పాటు అదే కోచ్‌లో ఉన్న ఇతర ప్రయాణీకుల వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది.(సీరియస్‌గా తీసుకోని.. అప్రమత్తంగా ఉండండి)

‘విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలి’

>
మరిన్ని వార్తలు