తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయం

31 Mar, 2018 17:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్‌ను తీసుకునే వీలుగా పలు మార్పులు తీసుకువచ్చింది. ఇక నుంచి నిత్యావసర వస్తువులను ఎక్కడి నుంచైనా ( పోర్టబిలిటీ) తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సి.వి ఆనంద్‌ తెలిపారు. రేషన్‌ తీసుకోకపోయినా కార్డును రద్దుచేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. దీని ద్వారా రాష్ట్రంలోని 2.75 కోట్ల మంది పేదలకు ప్రయోజనం కలుగనుంది. ఈ విధానం ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు