అలా చేస్తే ప్ర‌జ‌ల్లో భయాందోళ‌న‌లు: హైకోర్టు

14 May, 2020 17:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూర్యాపేటతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలందరికీ కరోనా పరీక్షలు జరపాలని సూర్యాపేట‌కు చెందిన వ‌రుణ్ సంకినేని హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. దీనిపై న్యాయ‌స్థానం గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచారణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ మాట్లాడుతూ.. ఇత‌ర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తున్నార‌ని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయ‌స్థానం ప్ర‌జ‌లంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నించింది. బ‌ల‌వంతంగా ప‌రీక్ష‌లు చేస్తే ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు పెరుగుతాయ‌ని హెచ్చ‌రించింది. పైగా ప్ర‌జ‌లంద‌రికీ ప‌రీక్ష‌లు జ‌రిపేందుకు కిట్లు, లేబొరేట‌రీలు స‌రిపోతాయా? అని ప్ర‌శ్నించింది. లాక్‌డౌన్‌తో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిన‌ప్పటికీ.. క‌రోనా క‌ట్ట‌డికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపింది. అనంత‌రం అడ్వకేట్ జనరల్ వాదనల కోసం త‌దుప‌రి విచార‌ణ‌ను సోమవారానికి వాయిదా వేసింది. (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ‘సిగ్నల్‌’ అవస్థలు !)

మరిన్ని వార్తలు