రోజుకు 3 పరీక్షలు

15 May, 2020 03:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముందుగా డిగ్రీ ఫైనల్‌ సెమిస్టర్,

తర్వాత ద్వితీయ, ప్రథమ సంవత్సర విద్యార్థులకు

కసరత్తు చేస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం సమా వేశమయ్యారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలన్న విషయంపై చర్చించారు. 

ముం దుగా ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకే పరీక్షలు నిర్వహించాలని, భౌతిక దూరం పాటిం చేలా, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రోజుకు మూడు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చింది. ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రంలోగా రెండు గంటలకో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాక, వెనువెంటనే ద్వితీయ, ప్రథమ సంవత్సరాలకు సెమిస్టర్, బ్యాక్‌లాగ్‌ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణ యానికి వచ్చింది. దీనిపై సమగ్ర ప్రణా ళికతో త్వరలోనే వర్సిటీలకు స్పష్టమైన ఆదే శాలు జారీ చేయాలని భావిస్తోంది. 

జూన్‌ 20 నుంచి వర్సిటీలు పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష సమయాన్ని రెండు గంటలకే తగ్గించాలని, డిటెన్షన్‌ రద్దు చేసి విద్యార్థులందరినీ పై సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయాలని ఇదివరకే విద్యామండలి ఆదేశించింది. అందుకు అనుగుణంగా  వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే భౌతిక దూరం పాటించడం సమస్యగా మారుతుందని గురుకుల విద్యాలయాల కార్యదర్శి లేఖ రాయగా దానిపైనా చర్చించారు.

>
మరిన్ని వార్తలు