‘అనామిక’పై అశోక్‌ నిర్లక్ష్యపు సమాధానం..!

5 Jun, 2019 08:30 IST|Sakshi

జవాబు పత్రాల్లోని మార్కులే ఫైనల్‌ అన్న బోర్డు కార్యదర్శి

వ్యాల్యుయేషన్‌ గాల్లో చేస్తామా అని వ్యాఖ్య

అనామిక మార్కులెలా మారాయంటే నిర్లక్ష్యపు సమాధానం

జవాబు పత్రాల్లో 21 ఉంటే వెబ్‌సైట్‌లో 48 ఎలా వచ్చాయంటే సమాధానం దాటవేత

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో ఫెయిలవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక విషయంలో ఇంటర్‌ బోర్డు ఇంకా నిర్లక్ష్యం వీడటం లేదు. తాము చేసిన తప్పును ఒప్పుకో కుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల జవాబు పత్రాలు, మార్కులపై మంగళ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోర్డు కార్యదర్శి అశోక్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శ నం. ఆత్మహత్య చేసుకున్న అనామిక మార్కుల విషయంలో నెలకొన్న గందరగోళంపై విలేక రులు అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధా నాలు చెప్పారు. అనామికకు జవాబుపత్రంలో 21 మార్కులు వస్తే 48 మార్కులు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో ఎలా పొందుపరిచారని విలేకరులు ప్రశ్నించగా అశోక్‌ చిరాకుపడ్డారు.
(అశోకా.. ఏంటీ లీల!)

‘వెబ్‌సైట్‌లో ఇచ్చినవి పరిగణనలోకి తీసుకోం. జవాబు పత్రాల్లో ఉన్న మార్కులనే పరిగణనలోకి తీసుకుంటాం. ఆ మార్కులే ఫైనల్‌. జవాబుపత్రాల మూల్యాంకనం గాలిలో చేయరు. ఆ జవాబు పత్రాలు నేను కరెక్షన్‌ చేయను. నాకు ఎలాంటి సంబంధంలేదు’ అంటూ విచిత్రమైన సమాధానం చెప్పారు. తప్పు ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పకుండా తప్పించుకునే సమాధానం ఇచ్చారు. అనామిక విషయంలో బోర్డు తప్పే చేయనట్లు ఆయన మాట్లాడడం గమనార్హం. ఏ విద్యార్థి అయినా తమ ఫలితాలను ముందుగా వెబ్‌సైట్‌లో ఇచ్చే మెమోలోనే చూసుకుంటారు. అలా అనామికకు మొదట 20 మార్కులు వేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆమె జవాబు పత్రాన్ని రీ వెరిఫికేషన్‌ చేసి 21 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు.

చివరకు మరోసారి ఫెయిల్‌ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్‌ చేసిన సమయంలో అనామికకు 48 మార్కులు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీంతో గందరగోళం నెలకొంది. దానిపై బోర్డు స్పష్టౖ మెన వివరణ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. మరోవై పు ఓఎంఆర్‌ షీట్లలో బోర్డు తప్పుగా ముద్రించే పొరపాట్లను విద్యార్థులు సరిచూసుకొని ఇన్విజిలే టర్లకు చెప్పి సరిచేయించుకోవాలని, లేదంటే అందు లోని తప్పులకు విద్యార్థులదే బాధ్యత అంటూ వారిని ఆందోళన పడేసే చర్యలకు బోర్డు దిగింది. 

బాధ్యులపై చర్యలు..
మూల్యాంకనంలో పొరపాట్లకు బా«ధ్యులైన లెక్చరర్లపై చర్యలు చేపడతామని అశోక్‌ పేర్కొన్నారు. అలాగే తొలుత ఫెయిలై, ఆ తర్వాత రీ వెరిఫికేషన్లో పాసైన విద్యార్థుల జవాబుపత్రాలు మొదట మూల్యాంకనం చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రీ వెరిఫికేషన్లో 1,155 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ లెక్కన గమనిస్తే లెక్చరర్లపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రీ వెరిఫికేషన్లో ఐదు లేదా అంతకన్నా మార్కులు పెరిగిన పేపర్లను మూల్యాంకనం చేసిన లెక్చరర్లకు రూ. 5 వేల జరిమానాతోపాటు మూల్యాంకన విధుల నుంచి మూడేళ్లు డీబార్‌ చేయనున్నట్లు అశోక్‌ తెలిపారు. గత నెల విడుదల చేసిన రీ వెరిఫికేషన్‌ ఫలితాల్లో 1,137 మంది విద్యార్థులు పాసైనట్లు బోర్డు ప్రకటించింది. వారం తిరిగే సరికి ఆ సంఖ్య మారిపోయింది. ఉత్తీర్ణుల సంఖ్య 1,155కి చేరింది. అంటే మరో 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 800 మంది ఫలితాల ప్రాసెసింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. వారిలో ఎంత మంది ఉత్తీర్ణులు అవుతారో వేచి చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు