18న సడక్‌ బంద్‌

11 Nov, 2019 04:52 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం.. రాష్ట్ర బంద్‌ తరహాలో ఏర్పాట్లు

నేడు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి

అఖిలపక్ష నేతలతో భేటీ అనంతరం కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సంఘాలు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని నిర్వహించాయి. శనివారం చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పోలీసు నిర్బంధాన్ని ఛేదించి వందల సంఖ్యలో కారి్మకులు గమ్యం చేరటంతో వచి్చన ఊపుతో ఉత్సాహంగా ఉన్న సమ్మె కార్యాచరణకు మరింత పదునుపెట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘సడక్‌ బంద్‌’నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది దాదాపు రాష్ట్ర బంద్‌ తరహాలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.

మొత్తంగా రాష్ట్ర రహదారులన్నింటిని దిగ్బంధం చేయటం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 37 రోజులు గా సమ్మె చేస్తున్నా, స్వయంగా హైకోర్టు కొన్ని సూచనలు చేసినా ప్రభుత్వం దిగిరాకపోవటాన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే జేఏసీ కనీ్వనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కనీ్వనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక నిరశన ప్రారంభించాలని నిర్ణయించింది. ఆదివారం అఖిలపక్ష నేతలతో సుదీర్ఘంగా భేటీ అయిన జేఏసీ నేతలు అనంతరం కార్యాచరణను ప్రకటించారు. జేఏసీ కోకనీ్వనర్లు రాజిరెడ్డి, సుధ తదితరులతో కలసి కనీ్వనర్‌ అశ్వత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు.

నేడు మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు
పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా కోరా లని జేఏసీ నిర్ణయించింది. సోమవారం వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేసి వారిని కలసి వివ రించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఇళ్లు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఇళ్లను ముట్టడించనున్నట్టు జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ కన్వీనర్, కో కనీ్వనర్లు ఇందిరాపార్కు వద్ద నిరవధిక నిరశనలు ప్రారంభించనున్నారు. ఇందిరాపార్కు వద్ద అనుమతి లభించని పక్షంలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో చేపట్టనున్నట్టు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.   

ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు..
ఆర్టీసీ కారి్మకులపై ప్రభుత్వ తీరు, చలో ట్యాంక్‌బండ్‌లో పోలీసుల ప్రవర్తనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. చలో ట్యాంక్‌బండ్‌లో మహిళా కండక్టర్ల పట్ల పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, చాలామంది గాయపడ్డారని, దీనిపై అవసరమైతే జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

సమ్మె మొదలైనప్పటి నుంచి చలో ట్యాంక్‌బండ్‌ వరకు చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాలకు సంబంధించిన ఫొటోలను, ఇప్పటివరకు చనిపోయిన కారి్మకులకు సంబంధించిన ఫొటో వివరాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించాలని అనుకున్నామని, కార్యక్రమం ఖరారయ్యాక కచి్చతమైన తేదీలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వీలైతే ఓరోజు హైదరాబాద్‌లో కూడా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు.

సడక్‌బంద్‌లో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఆ పార్టీ నేత సంపత్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేత నరసింహారావు, బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్, సీపీఐ నేత సుధాకర్, ఎమ్మారీ్పఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

అనుమతివ్వకపోగా దమనకాండనా..?
‘సమ్మెను ఇప్పటివరకు శాంతియుతంగానే నిర్వహించాం. అదే పంథాలో ట్యాంక్‌బండ్‌పై గంట సేపు నిరసన వ్యక్తం చేస్తామని కోరినా అనుమతి ఇవ్వలేదు. చలో ట్యాంక్‌బండ్‌కు వచ్చిన కారి్మకులు, మహిళలపై పోలీసులు దమనకాండకు దిగారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు యతి్నస్తున్నారు. చలో ట్యాంక్‌బండ్‌లో మావోయిస్టులు చొరబడ్డారన్న ఆరోపణ ను ఖండిస్తున్నాం. రాజ్యమన్నా, రాజ్యాంగమన్నా గౌరవమున్నవారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు’అని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

కార్మికులకు తోడుగా విపక్షాల కార్యకర్తలు..
ఇక నుంచి ఆర్టీసీ జేఏసీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. సమ్మె కార్యాచరణకు మద్దతు, సంఘీభావం తెలపటానికే పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని ఆయా పారీ్టలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ–అఖిలపక్ష నేతల భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. తదుపరి కార్యాచరణలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అప్పుడు ప్రజల మద్దతు పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డట్టు తెలిసింది.

దీనికి అన్ని పారీ్టలు సమ్మతించినట్లు సమాచారం.  సోమవారం హైకోర్టులో మళ్లీ వాదనలు ఉన్నందున మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, ఆర్టీసీ సమ్మె అంశాన్ని జాతీయ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ ఆదివారం నిర్ణయించింది. సోమ లేదా మంగళవారాల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల కమిషన్‌ను కలసి ఆర్టీసీ కారి్మకులకు న్యాయం చేయాలని కోరనుంది. ఇందుకోసం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది.   

మరిన్ని వార్తలు